English | Telugu
'కంగువా' సెట్లో సూర్య బిజీ బిజీ
Updated : Aug 6, 2023
విలక్షణమైన పాత్రలు, సినిమాలతో ఓ వైపు మాస్, మరో వైపు క్లాస్ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా రేంజ్లో ఇమేజ్ సంపాదించుకున్న అతి కొద్ది మంది స్టార్స్‌లో సూర్య ఒకరు. ఇప్పుడాయన నటిస్తోన్న తాజా చిత్రం 'కంగువా'. శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ దివా దిశా పటాని హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సూర్య కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా కంగువా తెరకెక్కుతోంది. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ చెన్నై ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. సినిమా కోసం వేసిన స్పెషల్ సెట్ వేసి మరీ చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ వారం రోజుల పాటు షూటింగ్ జరగనుంది. దీనికి కొనసాగింపుగా రాజమండ్రిలో షెడ్యూల్‌ను మేకర్స్ కంటిన్యూ చేస్తారు.
దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌ను మించి 'కంగువా' సినిమాను రూపొందిస్తున్నారు నిర్మాతలు. అది కూడా 2D,3D వెర్షన్స్‌లో రీసెంట్గా సూర్య పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ చేసిన గ్లింప్స్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. 'కంగువా' రిలీజ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ఏకంగా పది ఇండియన్ లాంగ్వేజెస్‌లలో విడుదల చేస్తున్నారు. అలాగే ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించే పనిలో నిర్మాతలున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో సూర్య వారియర్ పాత్రలో కనిపించబోతున్నారు. విలన్‌గా బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటిస్తున్నారు.
దీని తర్వాత సూర్య, వెట్రిమారన్ కాంబినేషన్లో వాడివాసల్ సినిమా తెరకెక్కాల్సి ఉంది. అలాగే మరో వైపు బాలీవుడ్ మేకర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహ్ర, మహాభారతంలోని కర్ణుడి పాత్రను ఆధారంగా చేసుకుని ఓ పాన్ ఇండియా మూవీని సూర్యతో చేయటానికి స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.