English | Telugu
సినీ పరిశ్రమలో విషాదం.. జూనియర్ బాలయ్య కన్నుమూత
Updated : Nov 2, 2023
తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. దివంగత నటుడు టీఎస్ బాలయ్య కుమారుడు, ప్రముఖ నటుడు జూనియర్ బాలయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 70 ఏళ్ళ బాలయ్య.. గురువారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు.
టీఎస్ బాలయ్య నట వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన జూనియర్ బాలయ్యకి కెరీర్ ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జూనియర్ సినీ ప్రయాణం మొదలైన కొద్దిరోజులకే ఆయన తండ్రి టీఎస్ బాలయ్య 57 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. అయినప్పటికీ జూనియర్ బాలయ్య నటుడిగా సత్తా చాటి వరుస అవకాశాలు సంపాదించుకున్నారు. నాలుగు దశాబ్దాల కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన, 2021 వరకు నటిస్తూనే ఉన్నారు. అనారోగ్యంగా కారణంగా కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు.