English | Telugu
ప్రభాస్ కొత్త సినిమాకి 50 డేస్ లో సెలబ్రేషన్స్ స్టార్ట్
Updated : Nov 2, 2023
ఒక సినిమా అర్ధ శతదినోత్సవాన్ని(50 డేస్ ) జరుపుకుంటే ఆ సినిమా మేకర్స్ మా సినిమా 50 రోజులు జరుపుకుందని వాల్ పోస్టర్స్ వేయించడం సహజం. కానీ ఒక సినిమాకి మాత్రం రిలీజ్ అవ్వకుండానే నిర్మాతలు 50 డేస్ వాల్ పోస్టర్ ని వేయించారు. అదెలా అని అంటారా?
ప్రభాస్ నుంచి వస్తున్న తాజా మూవీ సలార్. యావత్తు భారతం మొత్తం సలార్ మూవీ కోసం ఫుల్ వెయిటింగ్ లో ఉంది. ఈ సినిమా ఇంకో 50 రోజుల్లో విడుదల కాబోతుంది. ఈ రోజు నుంచి సరిగ్గా ఇంకో యాభై రోజుల్లో అంటే డిసెంబర్ 22 న సలార్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతుంది. మీ క్యాలెండర్ లో డిసెంబర్ 22 డేట్ కి మార్క్ పెట్టుకోండి అంటూ చిత్ర బృందం సరికొత్త రీతిలో ఎక్స్ వేదికగా సలార్ గురించి పబ్లిసిటీ ఇస్తుంది. సలార్ ఇంకో 50 రోజుల్లో రానుంది అంటూ నిర్మాతలు సలార్ 50 డేస్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. ప్రభాస్ ఫాన్స్ కూడా 50 డేస్ లో సలార్ రాబోతుందంటూ వేడుకలు చేస్తున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో ప్రభాస్ సరసన శృతిహాసన్ జతకట్టింది.హోంబిలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరంగదుర్ నిర్మాణ సారధ్యంలో సుమారు 250 కోట్ల భారీ బడ్జట్ తో సలార్ మూవీ నిర్మాణం జరుపుకుంది. సలార్ కి సంబంధించి ప్రభాస్ ఫాన్స్ హడావిడి కూడా స్టార్ట్ అయ్యింది.లేటెస్ట్ గా జరిగిన ప్రభాస్ బర్త్ డే వేడుకల్ని కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించి ప్రభాస్ భారీ కటౌట్ లని కూడా ఏర్పాటు చేసారు. మొత్తానికి ఇంకో యాభై రోజుల్లో సలార్ వరల్డ్ వైడ్ గా సందడి చేయనుంది.