English | Telugu

‘టెంపర్’ సక్సెస్ పై ఎన్టీఆర్ స్పందన

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు చాలా కాలం తర్వాత హిట్ సినిమాతో ఆకలి తీర్చుకున్నాడు. దెబ్బతిన్న పులిలా ఇంతకాలం ఎంత ప్రయత్నించినా కూడా తన అభిమానులను, ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. లేటెస్ట్ గా ఆయన నటించిన ‘టెంపర్’ దుమ్మురేపుతోంది. అన్నిచోట్ల కూడా హౌస్ ఫుల్ కలెక్షన్లతో రచ్చ రచ్చ చేస్తోంది. దాదాపు గతకొద్ది కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఎన్టీఆర్ ‘టెంపర్’ సక్సెస్ తో తన సత్తా ఏంటో నిరూపించాడు. ఈ సంతోషంలో ఈ సినిమాకు కథను అందించిన వక్కంతం వంశీ ఎన్టీఆర్ తో ఇంటర్వ్యూ మీ కోసం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.