English | Telugu

ప్రభాస్ తో మళ్ళీ 'మిస్టర్ పర్ఫెక్ట్'

ప్రభాస్ ను 'మిస్టర్ పర్ఫెక్ట్' గా చూపించి సూపర్ హిట్ కొట్టాడు దర్శకుడు ధశరధ్. ఇప్పుడీ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. అవును.. ప్రభాస్-ధశరధ్ కలయికలో మరో సినిమా రాబోతుందని టాక్. ఇటివలే ధశరధ్, ప్రభాస్ కు ఓ కధ చెప్పడం, దానికి ప్రభాస్ ఓకే చెప్పడం జరిగిందని ఫిల్మ్ నగర్ లేటెస్ట్ టాక్. ప్రస్తుతం 'బాహుబలి' తో బిజీ గా వున్నాడు ప్రభాస్. ఇది దాదాపు పూర్తి కావచ్చింది. ఈ చిత్రం తర్వాత ఈ సినిమా మొదలవుతుందని అంటున్నారు. అయితే ఈ సంవత్సరం ప్రభాస్ ఫ్యాన్స్ డబుల్ ధమాకా ఖాయం.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.