English | Telugu

సుమన్ తో జయహో తెలంగాణ

సుమన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "జయహో తెలంగాణ". అమరవీరుల త్యాగఫలం అనేది ఉపశీర్షిక. కొత్తపల్లి సతీష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిరియాల రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంద్ర, మధుబాల కథానాయికలు. ఇటీవలే హైదరాబాదులో ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు జరిగాయి. తొలి సన్నివేశానికి కోదండరామ్ క్లాప్ కొట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... "తెలంగాణాలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఓ నట శిక్షణాలయం ఏర్పరుస్తాం. సినిమాలకు పన్ను మినహాయింపును కల్పిస్తాం" అని అన్నారు. సుమన్ ఇందులో ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నారు. వచ్చే నెల ద్వితీయార్ధం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. దసరా కానుకగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.