English | Telugu
షారుఖ్ జవాన్ 50 డేస్ కలెక్షన్స్..11 లక్షలంటున్న అట్లీ
Updated : Oct 27, 2023
షారుఖ్ ఖాన్ హీరో గా అట్లీ దర్శకత్వం లో వచ్చిన జవాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరకి తెలిసిందే. షూటింగ్ దశ నుంచే విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న జవాన్ మూవీ అందరి అంచనాలకి తగ్గట్టే సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కేవలం హిట్ అవ్వడమే కాదు సొసైటీ కి ఒక బలమైన మెసేజ్ ని కూడా ఇచ్చింది. తాజాగా జవాన్ కి సంబంధించిన ఒక న్యూస్ తో షారుఖ్ ఫాన్స్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.
ఈ రోజుల్లో సినిమా ఎంత పెద్ద హిట్ అయినా రెండు వారాలకో మూడు వారాలకో ఆ సినిమా పరిమితమవుతుంది. కానీ గత నెల సెప్టెంబర్ 7 వ తేదీన రిలీజ్ అయిన జవాన్ సినిమా నేటితో 50 రోజులని పూర్తిచేసుకొని వంద రోజుల వైపు పరుగెడుతోంది. డ్యూయల్ రోల్ లో షారుఖ్ నటన తో పాటు అట్లీ దర్శకత్వం జవాన్ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసాయి. అలాగే మిగతా పాత్రల్లో నటించిన విజయ్ సేతుపతి, దీపికా పదుకొనె, నయనతార, ప్రియమణి లు కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.
జవాన్ సినిమా 50 రోజులు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని దర్శకుడు అట్లీ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వెల్లడి చేసాడు. జవాన్ సినిమా 50 రోజులుకి గాను ఇప్పటివరకు మొత్తం 1142 కోట్లు వసూలు చేసిందని ఈ రోజు కూడా 11 లక్షలు వసూలు చేసిందని నాకు చాలా సంతోషంగా ఉందని అట్లీ తన ఎక్స్ వేదికగా తెలిపాడు. అట్లీ పోస్ట్ తో షారుఖ్ ఫాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.