English | Telugu
మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. తెలుగునాట సూపర్ స్టార్ ప్రభంజనం
Updated : Aug 13, 2023
మామూలు సినిమాతో కూడా వందల కోట్ల వసూళ్లు రాబట్టగల క్రేజ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సొంతం. అలాంటిది ఆయన నటించిన తాజా చిత్రం 'జైలర్' పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన జైలర్.. ఫుల్ రన్ లో రూ.500 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగునాట కూడా జైలర్ తన హవా చూపుతోంది. మూడు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం.
తెలుగు రాష్ట్రాల్లో రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన జైలర్.. మూడు రోజుల్లోనే రూ.13.81 కోట్ల షేర్ తో లాభాల్లోకి ఎంటరైంది. తెలుగునాట మొదటి రోజు రూ.7.01 కోట్ల షేర్, రెండో రోజు రూ.2.65 కోట్ల షేర్, మూడో రోజు రూ.4.15 కోట్ల షేర్ తో సత్తా చాటిన జైలర్.. ఈరోజు ఆదివారం కావడంతో మరో రూ.4-5 కోట్ల షేర్ రాబట్టే అవకాశముంది. తెలుగునాట ఫుల్ రన్ లో ఈ సినిమా రూ.25 నుంచి 30 కోట్ల షేర్ దాకా రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మూడు రోజులకు గాను వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని పరిశీలిస్తే తమిళనాడులో రూ.59.10 కోట్ల గ్రాస్, తెలుగు రాష్ట్రాల్లో రూ.24.50 కోట్ల గ్రాస్, కర్ణాటకలో రూ.22.75 కోట్ల గ్రాస్, కేరళలో రూ.16.10 కోట్ల గ్రాస్, రెస్టాఫ్ ఇండియా రూ.4.25 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ లో రూ.97.44 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో మూడు రోజుల్లో రూ.224.14 కోట్ల గ్రాస్(రూ.110.10 కోట్ల షేర్) వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా రూ.123 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.13కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.
ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.44.75 కోట్ల షేర్, రెండో రోజు రూ.26.10 కోట్ల షేర్, మూడో రోజు రూ.39.25 కోట్ల షేర్ రాబట్టిన జైలర్.. నాలుగో రోజైన ఆదివారం మరో రూ.30 కోట్లకు పైగాషేర్ రాబట్టే ఛాన్స్ ఉంది. అంటే మొదటి వారాంతంలోనే ఈ సినిమా ప్రాఫిట్స్ లోకి అడుగు పెట్టనుంది.