English | Telugu

'భోళా శంకర్' కలెక్షన్స్.. 'ఆచార్య' కంటే దారుణం!

ఈ ఏడాది జనవరిలో 'వాల్తేరు వీరయ్య'తో తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించారు మెగాస్టార్ చిరంజీవి. అయితే కొద్ది నెలల్లోనే 'భోళా శంకర్' రూపంలో దారుణంగా నిరాశపరుస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన తమిళ సినిమా 'వేదాళం'కి రీమేక్ కావడం, మొదటి షో కే నెగటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో.. షో షోకి కలెక్షన్లు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో 'భోళా శంకర్' మెగాస్టార్ కెరీర్ లో మరో ఆచార్య అయ్యేలా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.15.38 కోట్ల షేర్, రెండో రోజు రూ.3.13 కోట్ల షేర్ రాబట్టిన 'భోళా శంకర్'.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రెండు రోజుల్లో రూ.18.51 కోట్ల షేర్ కే పరిమితమైంది. ఏరియాల వారీగా చూస్తే రెండు రోజుల్లో నైజాంలో రూ.5.64 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.2.52 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.10.35 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.1.35 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.2.12 కోట్ల షేర్ తో కలిపి.. వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో రూ.21.98 కోట్ల షేర్ సాధించింది.

మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.18.38 కోట్ల షేర్ రాబట్టిన భోళా శంకర్.. రెండో రోజు మాత్రం రూ.3.60 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. అంటే మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లలో ఏకంగా 80 శాతం డ్రాప్ కనిపించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జైలర్ హవా చూస్తుంటే.. మొదటి వారాంతానికే భోళా శంకర్ రన్ ముగిసినట్లే అని చెప్పొచ్చు. వరల్డ్ వైడ్ గా రూ.80 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ ఫుల్ రన్ లో రూ.30 కోట్ల షేర్ రాబట్టడం కూడా గగనమే అనేలా ఉంది పరిస్థితి. అంటే బయ్యర్లు కనీసం రూ.50 కోట్ల నష్టం చూడనున్నారు.

'భోళా శంకర్'తో పోలిస్తే చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన 'ఆచార్య' వసూళ్లే మెరుగ్గా ఉన్నాయి. ఆచార్య మొదటి రోజు రూ.35.05 కోట్ల షేర్, రెండో రోజు రూ.6.02 కోట్ల షేర్ రాబట్టగా.. ఫుల్ రన్ లో రూ.48.36 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పుడు 'భోళా శంకర్' ఫుల్ రన్ లో ఆచార్య ఫస్ట్ డే కలెక్షన్ రాబట్టడం కూడా కష్టమే అనేలా ఉంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.