English | Telugu
జగపతి విలనిజం బయటపడింది.
Updated : Feb 12, 2014
ఇప్పటివరకు నటుడిగా తన సత్తా ఏంటో చూపించి, ఆంధ్ర ప్రేక్షకులను మాత్రమే కాకుండా... అత్యధిక మహిళా అభిమానులను సంపాదించుకున్న ఏకైక నటుడు జగపతిబాబు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న "లెజెండ్" చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి విలన్ గా నటిస్తున్నారు. న్యాచురల్ గెటప్ లో, చాలా కొత్తగా కనిపిస్తున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. అంతే కాకుండా ప్రస్తుతం "రా రా కృష్ణయ్య" చిత్రంలో సందీప్ కిషన్ కు అన్న పాత్రలో నటిస్తున్నాడు. అదే విధంగా "పిల్లా నువ్వులేని జీవితం" చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాలు తనకు మరింత పేరు తీసుకోస్తాయని ఆయన ఆశిస్తున్నారు.