English | Telugu
మీరా పువ్వు పెళ్లి చేసుకుంది
Updated : Feb 12, 2014
తెలుగు, తమిళ హీరోయిన్ మీరాజాస్మిన్ సోమవారం రాత్రి పెళ్లి చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్ ను మీరా కొచ్చిలోని తన ఇంట్లో పెళ్లి చేసుకుంది. రిజిస్టర్ అధికారి ఒకరు మీరా ఇంటికి వచ్చి వీరిద్దరి సంతకాలను రిజిస్టర్ లో పొందుపరిచారు. అదే సమయంలో ఇద్దరు పూలదండలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇరు కుటుంబసభ్యులతో పాటు అతి ముఖ్యమైన సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. తిరువనంతపురంలోని పాలయంకోట్టైలో గల ఎల్‌ఎంస్ చర్చిలో మీరా, అనిల్ లు అందరి సమక్షంలో మరోసారి వివాహం చేసుకోబోతున్నారు.