English | Telugu
ముంబై పోలీసులకు దొరికిపోయిన ఇలియానా
Updated : May 8, 2014
"బర్ఫీ" చిత్రంతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఇలియానాను తాజాగా ముంబై పోలీసులు అరెస్టు చేసారు. ఈ అమ్మడు ప్రస్తుతం వరుణ్ ధావన్ సరసన "మై తేరా హీరో " సినిమాలో జతకట్టిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లలో పాల్గొని వెళ్ళివస్తూ పోలీసులకు దొరికిపోయింది. మంగళవారం రాత్రి ముంబైలో ఆమె కారుని ఆపిన పోలీసులు కారు నెంబర్ చెక్ చేశారు. ఆమె వాడుతున్న కారు మీదున్న నెంబర్ డూప్లికేట్ అని తెలియడంతో పోలీసులు ఇలియానాను అరెస్ట్ చేశారు. కాసేపు పోలీసులు తమదైన శైలిలో సెలబ్రేటిలను విచారణ జరిపే విధంగా ఈ అమ్మడిని కూడా విచారణ జరిపి వదిలేశారు. ప్రస్తుతం ఈ అమ్మడికి బాలీవుడ్ లో మంచి ఆఫర్లే వస్తున్నాయి.