English | Telugu

హంగ్రీ చీతా ఎంట్రీ ఇవ్వబోతోంది... పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ బి రెడీ!

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ లేటెస్ట్‌ మూవీ ‘ఒజి’. సుజిత్‌ దర్శకత్వంలో డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్‌ వస్తున్నాయి. సెప్టెంబర్‌ 2న ఉదయం 10.35 గంటలకు ఈ సినిమాకి సంబంధించిన కొత్త అప్‌డేట్‌ హంగ్రీ చీతా అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ సరసన ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకా అర్జున్‌ దాస్‌, శ్రీయారెడ్డి, ఇమ్రాన్‌ హష్మీ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తారు. థమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘ఒజి’ అనే డిఫరెంట్‌ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాపై చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఫ్యాన్స్‌ ఎంతో ఈగర్‌గా ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూస్తున్నారు.