English | Telugu
టైగర్ కా హుకుం.. మోత మోగిపోవడం ఖాయం!
Updated : Sep 25, 2023
ఎన్నో సంవత్సరాల తర్వాత రజనీకాంత్ ఫాన్స్ అందరూ గర్వంగా ఇదీ మా తలైవా రేంజ్ అని చెప్పుకునేలా చేసిన సినిమా 'జైలర్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో గత నెలలో విడుదల అయిన జైలర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఘన విజయం సాధించిందో ఇంకా కళ్ళ ముందు కనపడుతున్న సత్యం. ఈ మూవీ లో రజనీకాంత్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. జైలర్ మూవీ రికార్డు కలెక్షన్ లతో సంచలనం సృష్టించింది. అనిరుద్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ మూవీలోని సాంగ్స్ అన్ని సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా హుకుం సాంగ్ అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రజని అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకులని సైతం రజని మానియాతో ఉగిపోయేలా చేసింది.
తాజాగా హుకుం సాంగ్ కి సంబంధించిన పూర్తి వీడియో ని చిత్ర బృందం విడుదల చేసింది. ఇన్నిరోజులు హుకుం సాంగ్ పూర్తి వీడియోని యూట్యూబ్ లో చూడలేకపోయామే అనే బాధ రజని అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకుల్లో ఉండేది. ఇప్పుడు జైలర్ చిత్రబృందం తీసుకున్న నిర్ణయంతో అందరిలోనూ ఆనందం కొట్టు మిట్టాడుతుంది. ఇంక ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా టైగర్ కా హుకుం పూర్తి సాంగ్ మోత మోగిపోవడం ఖాయం. ఈ సాంగ్ కి తెలుగులో ప్రముఖ పాటల రచయిత బాస్కరబాట్ల లిరిక్స్ ని అందించడం జరిగింది.