English | Telugu

ప్రభాస్ ఫ్యాన్స్ కి మరో బిగ్ షాక్.. 'సలార్' రీ షూట్!

'సలార్'పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ కావడంతో.. ఈ సినిమా 'బాహుబలి', 'కేజీఎఫ్' స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అయితే మూవీ టీమ్ మాత్రం వారికి వరుస షాక్ లు ఇస్తోంది.

సలార్ రెండు భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగం ఈ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా, సీజీ వర్క్ పట్ల దర్శకుడు సంతృప్తిగా లేకపోవడంతో వాయిదా పడింది. పోనీ ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే జనవరిలో విడుదలవుతుంది అనుకుంటే.. ఏకంగా వచ్చే వేసవికి వాయిదా పడింది అంటున్నారు. ఇది చాలదు అన్నట్లు ఇప్పుడు క్లైమాక్స్ రీ షూట్ చేయనున్నారనే వార్త బలంగా వినిపిస్తోంది. సలార్-1 క్లైమాక్స్ పట్ల దర్శకుడు ప్రశాంత్ నీల్ సంతృప్తిగా లేరట. పార్ట్-2 పై అంచనాలను పెంచేలా, కంటెంట్ రేంజ్ కి తగ్గట్టుగా.. ఇప్పుడున్న క్లైమాక్స్ సరిపోదని ఆయన భావిస్తున్నారట. అందుకే క్లైమాక్స్ ని మరింత బలంగా రాసే పనిలో ఉన్నారట. త్వరలోనే క్లైమాక్స్ ఎపిసోడ్ ని రీషూట్ చేయొచ్చు అంటున్నారు. అసలే సలార్ సినిమా ఆలస్యమవుతుంది అంటే, ఈ రీషూట్ ల వల్ల ఇంకెంత ఆలస్యమవుతుందనే ఆందోళన అభిమానుల్లో ఉంది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.