English | Telugu

"హిందీ మగధీరకు నేను కాదు" రాజమౌళి

"హిందీ మగధీరకు నేను కాదు" అంటున్న రాజమౌళి. తెలుగులో గీతా ఆర్ట్స్ పతాకంపై,రామ్ చరణ్ తేజ రెండవ చిత్రంగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, రాజమౌళి దర్శకత్వంలో, అల్లు అరవింద్ నిర్మించగా, బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ఆల్ టైమ్ హిట్ చిత్రం"మగధీర".ఈ చిత్రాన్ని హిందీలో రణబీర్ కపూర్ హీరోగా పునర్నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి కూడా రాజమౌళే దర్శకత్వం వహిస్తారని ముందుగా వినపడింది. దీన్ని ఖండిస్తూ "హిందీ మగధీరకు నేను దర్శకత్వం వహించటం లేదు. మధుమంతెన హిందీలో మగధీర తీస్తున్నారట. ఆయనెవరో నాకు తెలీదు. నేను వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను."అని స్టేట్ మెంటిచ్చాడు రాజమౌళి. మరి రాజమౌళి రేంజ్ లో ఈ చిత్రం హిందీ మగధీర కి న్యాయం చేయగల వారెవరో మరి. హిందీలో అల్లు అరవింద్, మధు మంతెన కలసి "గజిని" చిత్రాన్ని అమీర్ ఖాన్ హీరోగా హిందీలో నిర్మించారు.మరి ఈ హిందీ మగధీరను ఎవరు నిర్మిస్తారో, ఎవరు దర్శకత్వం వహిస్తారో తెలియాల్సి ఉంది.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.