English | Telugu

'ఆగడు'లో హైడోస్‌ ఎంటర్‌టైన్‌మెంట్

శ్రీనువైట్ల సినిమాలో కామెడీ గురించి సపరేటుగా చెప్పనక్కరలేదు. తాను తీసిన ప్రతి సినిమా ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉండేలా జాగ్రత్తపడతాడు శ్రీనువైట్ల. ఇప్పుడు ఆగడు మూవీలో దూకుడులా కామెడీ మిస్ అవ్వకుండా చూసుకుంటున్నాడట. ఇంకా చెప్పాలంటే దూకుడిని మించేలా హై డోస్‌ ఆఫ్‌ కామెడీ పెట్టాడట. ఈ సినిమాలో బ్రహ్మానందంకి తోడు పోసాని కూడా చెలరేగిపోయాడని టాక్‌. యాక్షన్‌ సీన్స్‌, లవ్‌ సీన్స్‌లో కూడా కామెడీ ఉంటుందని, సినిమాలో డల్‌ మూమెంట్‌ అంటూ ఉండదని యూనిట్ రిపోర్ట్. సో మొత్తానికి ప్రేక్షకులను మరోసారి కడుపుబ్బ నవ్వించడానికి రెడీ అవ్వబోతుంది ఆగడు సినిమా. ఈ ప్రాజెక్ట్ ఎన్ని సంచలాను సృష్టిస్తుందో ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.