English | Telugu

వైరస్ గా వస్తున్న సంపూర్నేష్ బాబు

హృదయ కాలేయం లాంటి సూపర్ హిట్ చిత్రంతో సంచలనం సాధించిన హీరో సంపూర్నేష్ బాబు హీరోగా , సి.హెచ్.శివరామ కృష్ణ దర్శకత్వం లో A.S.N films పతాకం పై సలీం , ఎ.జే.రాంబాబు లు సంయుక్తం గా నిర్మిస్తున్న చిత్రం విజయదసమి సందర్భం గా షూటింగ్ ని ప్రారంభిస్తున్నారు. ఈ సినిమా కి www.వైరస్. Com అనే టైటిల్ ని ఖరారు చేసారు. బి వేర్ అనే టాగ్ లయిన్ ని పెట్టారు.

ఈ సందర్భం గా దర్శకుడు సి.హెచ్.శివరామ కృష్ణ మాట్లాడుతూ “ మా హీరో సంపూర్నేష్ బాబు ని ఈ చిత్రం లో సరికొత్త కోణంలో చూపిస్తున్నాము. ఈ కథకి హీరో కరెక్ట్ గా సెట్ అయ్యాడు, సంపూర్నేష్ బాబు నుండి ఎలాంటి వినోదాన్ని ప్రేక్షకులు కోరుకుంటారో అది ఈ చిత్రం లో పూర్తిగా ఉంటుంది” అని అన్నారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ “ 2 సవత్సరాలు గా సిని నిర్మాణం చేపట్టాలని ప్రయత్నిస్తున్నాము ఎన్నో కథలు విన్నాము కాని అటు మాస్ , ఇటు క్లాస్ ప్రేకశాకులకే కాక అన్ని వర్గాల ప్రేక్షకులకి రీచ్ అయ్యేలా అందరు ఫ్యామిలీ తో వచ్చి ఆనందించేలా ఈ కథని దర్శకుడు చెప్పారు. నేటి వాస్తవ పరిస్థితులని ప్రతిభింభింస్తున్నా, నేటి యువతరాన్ని ఉత్తేజపరుస్తూ , ఒక వినూత్న కథనం తో, ఆద్యంతం ఆసక్తి పరిచే కథాoశo తో, ఈ చిత్రం సాగుతుందని , అందుకే చిత్ర నిర్మాణం ప్రారంభించామని ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ని విజయ దశమి కి ప్రారంభం చేస్తాము, అక్టోబర్ లో, నవంబర్ లో షూటింగ్ చేసి డిసెంబర్ లో చిత్రాన్ని విడుదల చేస్తాము . త్వరలో మిగతా నటీనటుల్ని , సాంకేతిక నిపుణలని తెలియజేస్తాము ”అని చెప్పారు .

హీరో సంపూర్నేష్ బాబు మాట్లాడుతూ “ ఈ చిత్రం లో నేను ఇప్పటివరకు నటించని వెరైటీ పాత్ర లో నటిస్తున్నానని, ఈ చిత్రం తో తనకి సరికొత్త ఇమేజ్ వస్తుందని” అన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.