English | Telugu

'తెలుసు కదా' ట్రైలర్.. డీజే టిల్లు + కృష్ణ అండ్ హిజ్ లీల...

గత చిత్రం 'జాక్'తో నిరాశపరిచిన సిద్ధు జొన్నలగడ్డ.. ఈ అక్టోబర్ 17న 'తెలుసు కదా'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోనను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. (Telusu Kada Trailer)

'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్ధు. ముఖ్యంగా 'టిల్లు స్క్వేర్' మూవీ వరల్డ్ వైడ్ గా రూ.130 కోట్ల గ్రాస్ రాబట్టి, ఘన విజయం సాధించింది. దీంతో సిద్ధు ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన 'జాక్' మూవీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. తాజా చిత్రం 'తెలుసు కదా'పై కూడా పెద్దగా బజ్ లేదు. వంద కోట్ల హీరో నుంచి వస్తున్న సినిమాపై ఉండాల్సిన కనీస బజ్ లో సగం కూడా లేదు. ట్రైలర్ తోనైనా ఈ సినిమాపై హైప్ వస్తుంది అనుకుంటే.. అదీ జరిగేలా కనిపించడం లేదు.

రెండున్నర నిమిషాల నిడివితో 'తెలుసు కదా' ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఓ వైపు 'టిల్లు' మాడ్యులేషన్ లో కమెడియన్ హర్షతో సిద్ధు డైలాగ్స్ చెప్పడం, మరోవైపు 'కృష్ణ అండ్ హిజ్ లీల' తరహాలో ఇద్దరు హీరోయిన్స్ తో సిద్ధు రొమాన్స్ చేయడం చూపించారు. 'కృష్ణ అండ్ హిజ్ లీల' కథలోకి 'డీజే టిల్లు' క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుందో.. ఆ తరహాలో ఈ ట్రైలర్ సాగింది. అసలు 'తెలుసు కదా' చిత్ర కథ ఏంటి? ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అనే ఆసక్తిని రేకెత్తించేలా మాత్రం ట్రైలర్ ను కట్ చేయలేదనే చెప్పాలి. మరి ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని పెద్దగా ఆకర్షించలేకపోయిన ఈ మూవీ.. విడుదల తర్వాత ఊహించని కంటెంట్ తో ఏమైనా సర్ ప్రైజ్ చేస్తుందేమో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.