English | Telugu

ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్‌.. ఆ డైరెక్టర్‌కి పాయల్‌ రిక్వెస్ట్‌!

ఈమధ్యకాలంలో ప్రతి డైరెక్టర్‌ తను చేసే సినిమా కంటెంట్‌ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. ఏదో ఒక కొత్త పాయింట్‌తో సినిమా చేసి ఆడియన్స్‌ని థ్రిల్‌ చెయ్యాలని భావిస్తున్నారు. కమర్షియల్‌గా ఆ సినిమాలు ఎంత వరకు సక్సెస్‌ అవుతున్నాయనేది పక్కన పెడితే అటెమ్ట్‌ మాత్రం గట్టిగానే చేస్తున్నారు. అలాంటి డిఫరెంట్‌ కంటెంట్‌తో వచ్చిన సినిమా ‘మంగళవారం’. ఆర్‌ఎక్స్‌ 100 ఘనవిజయంతో డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న అజయ్‌ భూపతి తన నెక్స్‌ట్‌ సినిమా ‘మహాసముద్రం’తో నిరాశ పరిచాడు. మూడో సినిమా ‘మంగళవారం’ కోసం ఎంతో కష్టపడి ఓ డిఫరెంట్‌ సబ్జెక్ట్‌ని రెడీ చేసుకున్నాడు. తాను అనుకున్న కథని అంతే డిఫరెంట్‌గా తెరకెక్కించాడు. దానికి తగ్గట్టుగానే సినిమాలోని ఆర్టిస్టులంతా ప్రాణం పెట్టి సినిమా చేశారు. అయితే రిలీజ్‌ టైమింగ్‌ కరెక్ట్‌ కాకపోవడంతో ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది.

ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంలో హీరోయిన్‌గా నటించిన పాయల్‌ రాజ్‌పుత్‌ తన అందాలతో కుర్రకారుకి పిచ్చెక్కించింది. మళ్ళీ మంగళవారం చిత్రంలో కూడా ఆమెకు ఓ మంచి క్యారెక్టర్‌ ఇచ్చాడు అజయ్‌. బోల్డ్‌గా ఉండే ఆ క్యారెక్టర్‌ని పాయల్‌ ఎంతో పర్‌ఫెక్ట్‌గా చేసింది. ఎంతో మంచి పేరు కూడా తెచ్చుకుంది. ఈ సినిమాతో దర్శకుడిగా అజయ్‌ భూపతికి అవకాశాలు మెరుగు పడ్డాయి. అయితే పాయల్‌కు మాత్రం అవకాశాలు రావడం లేదు. ‘మంగళవారం’ చిత్రంలో ఎంతో బోల్డ్‌గా ఉండే క్యారెక్టర్‌ను మరెంతో ధైర్యంగా చేసిన పాయల్‌ గురించి ఇప్పుడు మాట్లాడేవారే లేరు. అయినప్పటికీ ‘కాంతార 1’లో తనకు అవకాశం ఇవ్వవలిసిందిగా దర్శకుడు రిషబ్‌ శెట్టికి ఓపెన్‌గా రిక్వెస్ట్‌ పెట్టింది పాయల్‌. మరి పాయల్‌ విషయంలో రిషబ్‌ శెట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.