English | Telugu

మత్స్యకన్య ముద్దులు.. స్టార్‌ ఫిష్‌ శుభాకాంక్షలు

సూపర్‌ 30 అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేసిన కృతిశెట్టి ఆ తర్వాత టాలీవుడ్‌ వచ్చేసి ‘ఉప్పెన’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా పెద్ద హిట్‌ అవ్వడంతో కృతికి అవకాశాలు పెరిగాయి. వరసగా ఓ అరడజను సినిమాలు చేసినప్పటికీ ఒక్కటి కూడా ఆమెకు ప్లస్‌ అవ్వలేదు. దాంతో అవకాశాలు కూడా తగ్గాయి. ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా చెయ్యని కృతి మలయాళంలో మాత్రం రెండు సినిమాలు చేస్తోంది. ఈ రెండు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. సినిమాలు తగ్గిపోవడంతో ప్రేక్షకులతో, అభిమానులతో టచ్‌లో ఉండేందుకు సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడు హల్‌చల్‌ చేస్తుంటుంది.

ఫోటో షూట్స్‌తో తన అందాల్ని ప్రదర్శిస్తూ యూత్‌కి పిచ్చెక్కించేందుకు ట్రై చేస్తూ ంఉటుంది. తాజాగా చేసిన ఫోటో షూట్‌లో మత్స్యకన్యగా అందర్నీ అలరిస్తోంది. ఈ ఫోటోలను పోస్ట్‌ చేస్తూ దానికి ‘మత్స్యకన్య ముద్దులు.. స్టార్‌ ఫిష్‌ శుభాకాంక్షలు’ అంటూ ఓ క్యాప్షన్‌ కూడా పెట్టింది. తను వేసుకున్న కాస్ట్యూమ్‌కి స్టార్‌ ఫిష్‌లా కలర్స్‌ అద్దడంతో మత్స్యకన్యలాగే కనిపిస్తోంది కృతి. తన అందమైన కర్లీ హెయిర్‌ని చూపిస్తూ ఎంతో అట్రాక్టివ్‌గా ఉంది. సప్త సముద్రాలు దాటి వచ్చిన మత్స్యకన్య అంటూ ఆమె అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమాకు నేషనల్‌ అవార్డు రావడంతో నెటిజన్లు అభినందిస్తున్నారు.