English | Telugu
పోలీసు ని పెళ్లి చేసుకుంటున్న హీరోయిన్
Updated : Dec 5, 2023
టాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. ఇటీవలే ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా చేసి తన అధ్బుతమైన నటనతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి ప్రముఖ హీరో వరుణ్ తేజ్ ని వివాహం చేసుకుంది. ఇప్పుడు అదే బాటలో మరో ప్రముఖ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కనుంది. ఇప్పుడు ఆ హీరోయిన్ ఎంగేజ్ మెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ హీరోయిన్ చిత్ర శుక్లా మధ్య ప్రదేశ్ లో పోలీస్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న వైభవ్ ఉపాధ్యాయని వివాహం చేసుకుంది. ఎంతో కాలం నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇరువైపుల పెద్దలని ఒప్పించి ఈ నెల డిసెంబర్ 8 న వివాహబంధంతో ఒక్కటవ్వనున్నారు. తాజాగా ఇరు కుటుంబాల మధ్య మెహందీ, హల్దీ ఫంక్షన్ కూడా జరిగింది. ఆ ఫోటోలని చిత్ర తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
నేను శైలజ అనే సినిమా ద్వారా తన సినీ కెరీర్ ని ప్రారంబించిన చిత్ర శుక్లా ఆ తర్వాత సోలో హీరోయిన్ గా మా అబ్బాయి అనే మూవీ చేసింది. ఆ సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేదు. కానీ చిత్ర కి ఆ తర్వాత కూడా వరుసగా హీరోయిన్ ఆఫర్ లు వచ్చాయి. రంగుల రాట్నం, సిల్లీ ఫెలోస్ ,తెల్లారితే గురువారం, హంట్ లాంటి చిత్రాలతో పాటు గోపీచంద్ హీరోగా వచ్చిన సినిమా పక్కా కమర్షియల్ సినిమాలో కూడా చిత్ర సెకండ్ హీరోయిన్ గా చేసింది.