English | Telugu

రామ్ లుక్ అదిరింది.. బోయపాటి మార్క్ మాస్ అవతార్!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి కెరీర్ స్టార్టింగ్ లో చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉండేది. అయితే 'ఇస్మార్ట్ శంకర్' నుంచి తన ట్రాక్ ని పూర్తిగా మార్చేశాడు. అందులో పక్కా మాస్ హీరోగా కనిపించి అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఇక అప్పటి నుంచి మాస్ జపం చేస్తున్నాడు. ప్రస్తుతం బడా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. అందులో రామ్ ఏ రేంజ్ లో కనిపిస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆయన న్యూ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆన్ స్క్రీన్ లో మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోనూ స్టైలిష్ గా కనిపించే అతి తక్కువ మంది హీరోలలో రామ్ ఒకడు. తాజాగా ఆయన ముంబై వెళ్తూ హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంటికి చిక్కారు. అందులో ఆయన రగ్డ్ లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. స్టైలిష్ డ్రెస్సింగ్, గుబురు గడ్డంతో ఉన్న ఆయన మాస్ అవతార్ ఆకట్టుకుంటోంది. రామ్ లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చూస్తుంటే బోయపాటి సినిమాలో ఆయన ఈ లుక్ లోనే కనిపించనున్నాడు అనిపిస్తోంది.