English | Telugu

బాలయ్య హరహర మహాదేవలో త్రిష, కాజల్ అగర్వాల్

బాలయ్య "హరహర మహాదేవ"లో త్రిష, కాజల్ అగర్వాల్ ఇద్దరూ హీరోయిన్లుగా నటిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న సినిమా "హరహర మహాదేవ". "హరహర మహాదేవ" సినిమా ఇటీవల బాలయ్య జన్మదినం సందర్భంగా ఘనంగా ప్రారంభమైంది. "హరహర మహాదేవ" సినిమాలో ప్రముఖ హీరోయిన్లు త్రిష, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసింది.

అయితే ఈ వార్త ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది."హరహర మహాదేవ" సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన వినాయిల్స్ లో వేరేవారి శరీరాలకు బాలయ్య ముఖాన్ని తగిలించి కనపడటం విచ్చేసిన వారిని ఆశ్చర్యపరిచింది. కానీ అది ఫొటో షాప్ కాదనీ, ఫొటోషూట్ అనీ నిర్మాత బెల్లంకొండసురేష్ చెప్పటంతో ...ఎవరైనా ఇంతపచ్చిగా అబద్ధం ఎలా చెపుతారా...? అని ఆశ్చర్యపోవటం మీడియా వంతైంది.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.