English | Telugu

హన్సికకు అతీతశక్తులు

వరుస చిత్రాలతో తెలుగు, తమిళ చిత్రాల్లో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ హన్సిక త్వరలోనే మాయ చేయనుంది. ఈ అమ్మడు ప్రస్తుతం తమిళంలో దర్శకుడు సుందర్.సి తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నటిస్తుంది. ఇందులో హన్సిక అతీతశక్తులున్న పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తుందట. ఈ పాత్ర చేయడానికి చాలా కష్టమైనప్పటికీ కూడా తనకు చాలా నచ్చిందని చెప్పుకొచ్చింది. ఇందులో హన్సికతో పాటుగా లక్ష్మీరాయ్, సంతానం ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. హార్రర్ కామెడీ తరహాలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం హన్సిక తెలుగులో రవితేజతో "పవర్", రామ్ తో "పండగ చేస్కో", నాగచైతన్యతో "దుర్గ" చిత్రాలలో నటిస్తుంది. ఒకరకంగా హన్సిక 2014 డైరీ డేట్స్ మొత్తం నిండిపోయాయనే చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమాలు హిట్టయితే ఈ అమ్మడు తన రెమ్యునరేషన్ ను ఎంతగా పెంచేస్తుందో ఏమో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.