English | Telugu

Gummadi Narsaiah: అసలు ఈ గుమ్మడి నర్సయ్య ఎవరు..?

ప్రజా నాయకుడు 'గుమ్మడి నర్సయ్య' గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆయన జీవితం ఆధారంగా 'గుమ్మడి నర్సయ్య' పేరుతో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ టైటిల్ రోల్ పోషిస్తుండటం విశేషం. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో పలువురు 'గుమ్మడి నర్సయ్య' గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.(Gummadi Narsaiah)

చిన్న చిన్న రాజకీయ నాయకులే మందీ మార్బలంతో హడావుడి చేసే రోజులివి. అలాంటిది ఐదు సార్లు ఎమ్మెల్యేగా పని చేసినా.. సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు గుమ్మడి నర్సయ్య. నిజాయితీ, నిరాడంబరత ఆయన సిద్ధాంతం. సైకిల్ ఆయన వాహనం.

ఖమ్మం జిల్లా, సింగరేణి మండలం, టేకులగూడెం గ్రామానికి చెందిన గుమ్మడి నర్సయ్య.. మొదటినుండి ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపించేవారు. గ్రామ సర్పంచ్ గా తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన.. ఎమ్మెల్యేగా ఎదిగి, ఆదర్శ నాయకుడిగా పేరుపొందారు.

సిపిఐ(ఎంఎల్ - న్యూ డెమోక్రసీ) పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఎమ్మెల్యే 'గుమ్మడి నర్సయ్య' కావడం విశేషం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు నియోజకవర్గం నుండి 1983లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు నర్సయ్య. అనంతరం 1985, 89, 99, 2004 లో కూడా గెలుపొంది.. ఆ నియోజకవర్గం నుండి మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.

ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే.. తమని తాము దేవుళ్ళలా ఊహించుకుంటారు కొందరు రాజకీయ నాయకులు. అలాంటిది, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. ప్రజల్లోనే ఉంటూ ఓ సామాన్యుడిలా జీవిస్తున్నారు నర్సయ్య.

ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో.. బస్సు లేదా ట్రైన్ లో హైదరాబాద్ వచ్చి.. పార్టీ ఆఫీసులో విశ్రాంతి తీసుకొని, ఆటోలోనో లేదా సైకిల్ మీదనో అసెంబ్లీకి వెళ్ళేవారు. ప్రచారాలకు, హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. ఎమ్మెల్యేగా పొందిన జీతం మొత్తం పార్టీకే విరాళంగా ఇచ్చేవారు.

ఒకట్రెండు సార్లు ఎమ్మెల్యేగా చేస్తేనే.. వందల కోట్ల ఆస్తులు పోగేసేవాళ్ళని చూస్తుంటాం. అలాంటిది, నర్సయ్యకు కొద్దిపాటి పొలం తప్ప ఆస్తులు లేవు. ఇప్పటికీ ఒక్క చిన్న ఇంట్లో సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిలా జీవిస్తున్నారు.

రైతులు, గిరిజనులు, శ్రామికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన గుమ్మడి నర్సయ్య.. ప్రజా నాయకుడిగా, ప్రజల మనిషిగా లక్షలాది హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.