English | Telugu

Akhanda 2: 'అఖండ 2' బ్లాస్టింగ్ రోర్.. బాలయ్య సింహ గర్జన..!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'అఖండ 2'. అసలే బాలయ్య-బోయపాటి కాంబో, దానికి తోడు 'అఖండ' సీక్వెల్ కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే అఘోర పాత్రకు సంబంధించిన టీజర్ విడుదలై ఆకట్టుకుంది. తాజాగా మరో పాత్రకు సంబంధించిన టీజర్ విడుదలైంది. (Akhanda 2 Thaandavam)

'అఖండ 2' నుంచి బ్లాస్టింగ్ రోర్ పేరుతో 50 సెకన్ల నిడివి ఉన్న టీజర్ ను రిలీజ్ చేశారు. అదిరిపోయే యాక్షన్ సీన్ తో బాలయ్య పాత్రను రివీల్ చేశారు. ఆయన లుక్ పవర్ ఫుల్ గా ఉంది. "సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో, ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియదు. ఊహకు కూడా అందదు" అంటూ బాలకృష్ణ గర్జించినట్టుగా డైలాగ్ చెప్పడం హైలైట్ గా నిలిచింది. ఇక గుర్రాల ముందు ఆయన నిల్చున్న తీరు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

బాలకృష్ణ-బోయపాటి కాంబోపై ఉండే అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా 'బ్లాస్టింగ్ రోర్' టీజర్ ఉంది. బాలయ్య పోషిస్తున్న రెండు పాత్రలు ఎంతో పవర్ ఫుల్ గా, ఒక దానిని మించి మరొకటి అన్నట్టుగా ఉండబోతున్నాయని ఈ టీజర్ తో క్లారిటీ వచ్చింది. అలాగే టీజర్ లో తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మెప్పించింది.

కాగా, 'అఖండ 2' చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో బాలయ్య-బోయపాటి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం