English | Telugu

గోవిందుడు ఎప్పుడూ వస్తాడో..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం దసరా కానుకగా రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుతున్న విధానం చూస్తే దసరాకి సినిమా రిలీజ్ కష్టమేనని అంటున్నారు. ప్రస్తుతం జోర్డాన్‌లో ఒక పాట చిత్రీకరణ జరుపుతున్నారు. అయితే చిత్రం మొత్తం పూర్తి కావడానికి కాస్త సమయం అవసరమని తెలిసింది. అక్టోబర్‌ 1 రిలీజ్‌ చేయాలంటే, సెప్టెంబర్‌ 25 నాటికి ఫస్ట్‌ కాపీ రెడీ చేయాలి. కానీ ఆ డెడ్‌లైన్‌ ని సినిమా యూనిట్ అందుకోగలదా? ఇంతవరకు ఈ సినిమాకి ఆడియోకి సంబంధించిన న్యూస్ కూడా బయటకురాలేదు. మరి ఎప్పుడూ ఆడియో రిలీజ్ చేస్తారో? అక్టోబర్‌ 1కి సినిమాని ఎలా సిద్ధం చేస్తారో అనేది వేచి చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.