English | Telugu

గోపీచంద్ కొత్త సినిమా షురూ!

లౌక్యం ఘ‌న‌విజ‌యంతో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చారు క‌థానాయ‌కుడు గోపీచంద్‌. ఈ వేస‌వికి జిల్‌తో మ‌రోసారి వినోదాన్ని పంచడంలో స‌క్సెస్ అయ్యారు కూడా. ఇదిలా ఉంటే.. గ‌తంలో గోపీచంద్ హీరోగా య‌జ్ఞం వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన ఎ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో ఓ కొత్త చిత్రం శనివారం ప్రారంభ‌మైంది. లౌక్యం చిత్రాన్ని నిర్మించిన భ‌వ్య క్రియేష‌న్స్ సంస్థ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుండ‌గా.. శ్రీ‌ధ‌ర్ సీపాన‌ క‌థ‌ను అందిస్తున్నారు. కోన వెంక‌ట్‌, గోపీ మోహ‌న్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. మొత్త‌మ్మీద హిట్ కాంబినేష‌న్‌ల‌తో గోపీచంద్ చేస్తున్న ఈ ప్ర‌య‌త్నం ఏ మేర‌కు విజ‌యం సాధిస్తుందో చూడాలి.