English | Telugu
నాలుగో సారి ప్రేమలో పడ్డ సంగీత దర్శకుడు..ఈ సారైనా పెళ్లి ఉంటుందా?
Updated : Dec 14, 2023
శర్వానంద్ హీరోగా వచ్చిన మళ్ళీ మళ్ళీ ఇది రానీ రోజు తో సంగీత దర్శకుడుగా తెలుగు పరిచయమైన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్. ఆ తర్వాతా కూడా భలే భలే మగాడివోయ్, ఊపిరి,మజ్ను, ప్రేమమ్ ,గీత గోవిందం లాంటి సినిమాలకి సూపర్ హిట్ ఆల్బమ్ ని అందించి ఆ సినిమాల విజయంలో కీలక పాత్రని పోషించాడు. తాజాగా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన వార్తలతో గోపి సుందర్ వార్తల్లోకి ఎక్కాడు.
గోపిసుందర్ ఈ మధ్య యూరప్ లో జరిగిన సంగీత విభావరిలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అక్కడ ప్రియా నాయర్ అనే అమ్మాయితో కలిసి చాలా క్లోజ్ గా ఫోటోలు దిగాడు. దీంతో గోపిసుందర్ నాలుగోసారి ప్రేమలో పడ్డాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. గోపి సుందర్ కి ఇప్పటివరకు మూడు సార్లు పెళ్లి జరిగింది. కొన్నేళ్ల కిందట ప్రియా అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. ఇద్దరికీ మాధవ్, యాదవ్ అనే పిల్లలు ఉన్నా కూడా ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో విడిపోయారు.ఆ తర్వాత సింగర్ అభయ హిరణ్మయి తో తొమ్మిదేళ్లు సహజీవనం చేసాడు.
మళ్ళీ తనని కాదని ఇంకో సింగర్ అమృత సురేష్ ని పెళ్లి చేసుకున్నట్టు సంవత్సరం క్రితం ప్రకటించాడు. ఇప్పుడు వాళ్లిద్దరు కూడా విడిపోయారనే వార్తలు వస్తున్నాయి .ఇందుకు బలం చేకూరేలా గోపి అండ్ అమృతలు సోషల్ మీడియా లో ఒకరికొకరు అన్ ఫాలో చేసుకున్నారు. బయట కూడా ఇద్దరు కలిసి కనపడటం లేదు. విదేశాలకి వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తున్నారు. పైగా గోపి సుందర్ యూరప్ లో ప్రియా నాయర్ తో కలిసి దిగిన ఫోటోలని ప్రియా నాయర్ తన ఇనిస్టాగ్రమ్ లో షేర్ చేసి ఎలా ప్రేమించాలి ఎలా జీవించాలి అని నేర్పిన వ్యక్తితో సంతోష క్షణాలు అనే క్యాప్షన్ ని కూడా జోడించింది.