English | Telugu

జెనిలియా కడుపులో నలుసు


నాలుగు మాటలు, కుదురితే కప్పు కాఫీ డైలాగ్ గుర్తుండే వుంటుంది. బబ్లీ గర్ల్ హాసిని ఉరుఫ్ జెనిలియా.. రితేష్ దేశ్‌ముఖ్ అనే బాలీవుడ్ హీరోని పెళ్లి చేసుకుని ముంబాయిలో బొమ్మరిల్లు కట్టుకుని సెటిల్ అయిపోయింది. అయినా అడపాదడపా, సినిమాల్లో కనిపిస్తోంది. కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించేసింది.

తాజాగా హాసిని న్యూస్ లోకి రావడానికి కారణం, ఈ క్యూట్ గర్ల్ ఇప్పుడు తల్లి కాబోవటం. ఆరెంజ్, బొమ్మరిల్లు, సై చిత్రాల్లో యంగ్, టీనేజ్ గర్ల్ గా మురిపించిన జెనీలియా, పెళ్లయినా అంతే అందంతో ఆకట్టుకుంది. రెండు పిలకలేసుకుని, చిన్నపిల్లలా గెంతుతూ కనిపించిన హాసిని తల్లి కాబోతోంది.

ఈ విషయం గురించి కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. గతంలో ఒక ప్రీమియర్ లో జెనీలియా కనిపించినప్పుడే ఆమె గర్భవతి అంటూ కథనాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త రితేష్ కన్‌ఫర్మ్ చేశారు. 2 నెలలుగా వినిపిస్తున్న ఈ వార్తను ఆయన నిజమే అని ధృవీకరించారు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ రితేష్,జెనిలియా దంపతులకి కంగ్రాట్స్ చెబుతున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.