English | Telugu

రామ్ చరణ్ లో మెగా చేంజ్


మెగా టార్చర్ పేరిట కొత్త పేరు తెచ్చుకుంటున్న రామ్ చరణ్, ఈ తరుణంలో ఆ ఇమేజ్ నుంచి బయటకు వచ్చే మంచి పని ఒకటి చేశాడని వార్తలు వస్తున్నాయి. ఆయన ఒక నిర్మాతతో కొత్త తరహాలో నడుచుకున్నాడట.. అది తెలిసిన వారంతా ఈ కొత్త పరిణామానికి షాక్ అయ్యారట.
రెమ్యునరేషన్లు, నిర్మాణవ్యయం, సినిమా పూర్తయ్యేసరికి నిర్మాతల పని అయిపోతుంది. అంత ఖర్చు పెట్టి తీసిన ఆడకపోతే ఇక ఆ నిర్మాత పరిస్థితి చెప్పనవసరంలేదు. కుటుంబం నిర్మహిస్తున్న నిర్మాణ సంస్థలను చూసి తెలుసుకున్నాడో, లేక మరొకటో తెలియదు కానీ, నిర్మాత నష్టాన్ని భర్తీ చేయాలని రామ్ చరణ్ భావించినట్లు సమాచారం.


కృష్ణవంశీ డైరెక్షన్ లో బండ్ల గణేష్ నిర్మిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం తమిళ నటుడు రాజ్‌కిరణ్‌తో షూటింగ్ నిర్వహించారు.అది చిరంజీవికి నచ్చక ఆ క్యారెక్టర్ ప్రకాశ్ రాజ్ తో చేయించాలని సూచించారట. షూట్, రీషూట్ ఈ తతంగానికి మొత్తం 10 కోట్లు ఖర్చు అయిందని నిర్మాత లబోదిబోమంటున్న విషయం గురించిన వార్తలు వెలువడ్డాయి. ఈ విషయం తెలిసి, గణేష్ ను తమాయించడానికి 5 కోట్ల భారం తన మీద వేసుకుని వుంటాడు చెర్రి. ఏమయినా నిర్మాత బాధ అర్థం చేసుకుంటే సినిమాకు ఎంతో మిగిల్చినట్టే. అలాంటిది నష్టాన్ని భర్తి చేసే హీరోగా రామ్ చరణ్ మారడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.


దీన్ని బట్టి ప్రొడ్యూసర్ నుంచి తీసుకోవడమే కాదు. నష్టం కలిగిస్తే భర్తీ చేయడానికి ముందుకు వస్తామనే కొత్త ట్రెండ్ చరణ్ స్టార్ట్ చేశాడనవచ్చా!

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.