English | Telugu

అంజలి గీతాంజలి విడుదల

అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "గీతాంజలి". రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎంవివి సత్యనారాయణ నిర్మాత. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పకులు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవలే హైదరాబాదులో నటుడు పవన్ కళ్యాణ్ విడుదల చేసారు. ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ..."ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా సాగిపోతుంది. నవ్విస్తూ, భయపెట్టేలా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అంజలి కెరీర్ లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలుస్తుంది. పవన్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే యాభై శాతం పూర్తయ్యిందని, జూన్ లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత తెలిపారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.