English | Telugu

అనామికగా మారిన సునీత

నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "అనామిక". శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. ఈ చిత్రానికి సంబంధించిన "క్షణం క్షణం" అనే పాటను చిత్ర ప్రమోషన్ కోసం వాడుకున్నారు. ఈ పాట వీడియోను ఇటీవలే విడుదల చేసారు. ఈ ప్రమోషనల్ పాటలో గాయని సునీత అనామిక పాత్ర పోషించింది. ఈ సినిమాలో నయనతార తన భర్త కోసం ఎలా వెతికిందో, అతనికోసం ఎంత ఆరాటపడిందో సునీత కూడా అలాగే అభినయించింది. పాట పాడుతూనే అనామిక పాత్రలోకి వెళ్ళిపోయి భర్త కోసం వెతికేసింది. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.