English | Telugu
షారూక్‌నే మించేసిన చరణ్!
Updated : Oct 27, 2023
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఒకే ఏడాదిలో పఠాన్, జవాన్ చిత్రాలతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు ఏకంగా వెయ్యేసి కోట్ల రూపాయలను దాటేసి సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. ఇప్పుడు షారూక్ మరో సినిమాగా డంకీతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రామ్ చరణ్ ఓ విషయంలో బాద్ షానే దాటేశారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏ విషయంలో మెగా పవర్ స్టార్ రికార్డ్ క్రియేట్ చేశారనే అనుమానం రాకపోదు. అసలు విషయమేమంటే.. ప్రస్తుతం చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ గేమ్ ఛేంజర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
గేమ్ ఛేంజర్ మూవీ నుంచి దీపావళి సందర్బంగా తొలి పాటను విడుదల చేయబోతున్నారు మేకర్స్. దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. అయితే దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయమొకటి తెలిసింది. అదేంటంటే, ఇది హీరో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్. ఈ పాట కోసం 20 కోట్లు ఖర్చు అయ్యాయని మీడియా వర్గాల్లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆ లెక్కన చూస్తే రీసెంట్‌గా విడుదలైన షారూక్ ఖాన్ మూవీ జవాన్‌లో జిందా బందా సాంగ్‌ను 16 కోట్లను ఖర్చు చేశారు. ఇప్పుడా లెక్కలో షారూక్‌ని చరణ్ క్రాస్ చేసినట్లే.
ఓ పాటకే శంకర్ ఈ రేంజ్‌లో ఖర్చు పెట్టించటానికి కారణం ఉంది. అదేంటంటే.. ఈ పాటను జనాల మధ్య ఒరిజినల్ లొకేషన్స్‌లో చిత్రీకరించినట్లు ఉంటుందట. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.ఓ పాత్రలో ముఖ్యమంత్రిగా, మరో పాత్రలో ఎన్నికల అధికారిగా కనిపించనున్నారు. ఎస్.జె.సూర్య, సునీల్, శ్రీకాంత్ తదితరులు ఇతర రోల్స్‌లో మెప్పించబోతున్నారు.