English | Telugu
పుష్ప 2.. ప్రతి సీన్ ఇంటర్వెల్ లా ఉంటుంది!
Updated : Nov 14, 2023
'పుష్ప'కి రెండో భాగంగా రూపొందుతోన్న 'పుష్ప: ది రూల్'పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక తాజాగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాటలతో ఈ చిత్రంపై అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పుష్ప-2 గురించి డీఎస్పీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "సుకుమార్ గారు రాసిన కథ అద్భుతంగా ఉంది. ఆయన నేరేట్ చేస్తుంటే చప్పట్లు కొడుతూనే ఉన్నాం. ప్రతి సీన్ ఇది ఇంటర్వెల్ సీనా అని అనుకునేలా ఉంటుంది." అన్నాడు. దేవి మాటలను బట్టి చూస్తే, ప్రతి సీన్ ఇంటర్వెల్ లా అంటే సుకుమార్ ఏ రేంజ్ లో సీన్స్ రాశారో అర్థం చేసుకోవచ్చు.
రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ 2024 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.