English | Telugu

రాజమౌళి "ఈగ" కి మళ్ళీ సెంథిల్

రాజమౌళి దర్శకత్వంలోని "ఈగ" చిత్రానికి మళ్ళీ సెంథిల్ కుమార్ కెమెరామేన్ గా వచ్చారు. ఈ "ఈగ" చిత్రానికి ముందుగా జేమ్స్ పౌల్ ని కెమెరామేన్ గా ఎన్నుకున్నారు.కానీ రాజమౌళి వర్కింగ్ స్టైల్ కి అతనికీ కుదరక పోవటంతో సెంథిల్ కుమార్ నే రాజమౌళి రమ్మని కబురు పంపారట. రాజమౌళి, సెంథిల్ కుమార్ కాంబినేషన్ లో గతంలో ఛత్రపతి, యమదొంగ, మగధీర వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు వచ్చాయి. అదీ గాక ఆ మధ్య కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క నటించగా వచ్చిన "అరుంధతి" చిత్రానికి కూడా సెంథిల్ కుమార్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ నిర్వహించారు.

రాజమౌళి "ఈగ" చిత్రంలో గ్రాఫిక్స్ అధికంగా ఉండటం, సెంథిల్ గతంలో రాజమౌళితో పనిచేసి ఉండటం వల్లా, రాజమౌళికి ఏం కావాలో సెంథిల్ తేలికగా గ్రహించగలడని, ఆ విధమగా రిజల్ట్ అందించగలడని "ఈగ" చిత్రానికి రాజమౌళి మళ్ళీ సెంథిల్ నే తీసుకోవటం జరిగిందట. మరి రాజమౌళి, సెంథిల్ కాంబినేషన్ లో రాబోతున్న "ఈగ" చిత్రం విజువల్ ఫీస్ట్ అవుతుందనటంలో సందేహం అక్కర్లేదు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.