English | Telugu

మహేష్ బాబు దూకుడుకి యూనివర్సెల్ ప్రమోషన్

మహేష్ బాబు "దూకుడు" కి యూనివర్సెల్ ప్రమోషన్ చేస్తుందట. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, "ఏం మాయ చేశావే" చిత్రం ఫేం సంత హీరోయిన్ గా, శ్రీనువైట్ల దర్శకత్వంలో, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న చిత్రం "దూకుడు". ఈ చిత్రాన్ని ప్రమోషన్ చేయటానికి "యూనివర్సెల్" అనే సెల్ ఫోన్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా ముందుకు వచ్చింది.

మహేష్ బాబు "దూకుడు" చిత్రం తాలూకు హోర్డింగ్స్ ని వివిధ నగరాల కూడళ్ళలో ఏర్పాటు చేస్తూ, ఆ హోర్డింగ్స్ మీద తమ సెల్ ఫోన్ కంపెనీ యాడ్ ని కూడా ప్రమోట్ చేసుకుంటారన్నమాట. అలగే ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయటానికి ఉన్న అన్ని దారులనూ ఈ సెల్ ఫోన్ కంపెనీ వినియోగించుకుంటుందనీ, అలాగే తమ కంపెనీ ఉత్పత్తులను కూడా ప్రమోట్ చేసుకుంటుందట. ఈ విధంగానే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ప్రమోషన్ కి రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది. కానీ పవన్ వారి ఆఫర్ ని తిరస్కరించారని వినికిడి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.