English | Telugu

దృశ్యం 3: అజ‌య్‌, మోహ‌న్‌లాల్ క‌లిసి ప‌నిచేస్తారా?

అజ‌య్ దేవ్‌గ‌న్‌, మోహ‌న్‌లాల్ క‌లిసి ఒకేసారి సెట్స్ లో ఉండ‌బోతున్నారా? ఇద్ద‌రు స్టార్ల‌ను ఒకేసారి డీల్ చేయ‌డానికి జీతు జోసెఫ్ ఫిక్సయ్యారా? అనేది ఇంట్ర‌స్టింగ్ విష‌యం. దృశ్యం ఒన్ అండ్ టూ, రెండూ బంప‌ర్ హిట్లే. ఇప్పుడు దృశ్యం 3 ప‌నుల్లో ఉన్నారు జీతు జోసెఫ్‌. 2024లో ఫ్లోర్స్ మీద‌కు తీసుకెళ్ల‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఐకానిక్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌లో ఫైన‌ల్ ఫిల్మ్ ఇదే అవుతుంది. 2013లో మోహ‌న్‌లాల్‌, జీతూ జోసెఫ్ క‌లిసి దృశ్యం మూవీకి వ‌ర్క్ చేశారు. హిందీలో అజ‌య్ దేవ్‌గ‌న్‌, త‌మిళ్‌లో క‌మ‌ల్‌హాస‌న్‌, తెలుగులో వెంక‌టేష్ ఈ స‌బ్జెక్టులో ఇన్వాల్వ్ అయ్యి బంప‌ర్ హిట్స్ చూశారు. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో థ‌ర్డ్ పార్ట్ రెడీ అవుతోంది. దృశ్యం3 బేసిక్ ప్లాట్ లాక్ అయింది. ``అభిషేక్ పాథ‌క్, అత‌ని టీమ్ ఆఫ్ రైట‌ర్స్ క‌లిసి థ‌ర్డ్ పార్ట్ ని లాక్ చేశారు. జీతు జోసెఫ్ టీమ్ ఆ థీమ్‌ని బాగా ఇష్ట‌ప‌డింది. ఈ ఐడియాతోనే ఫైన‌ల్ ఎపిసోడ్‌ని కంక్లూడ్ చేయాల‌నుకుంటున్నారు`` అన్న‌ది బాలీవుడ్ న్యూస్‌.

హిందీ, మ‌ల‌యాళంలో ఒకేసారి షూటింగ్ చేయాల‌న్న‌ది జీతు ఐడియా అట‌. తెలుగు మేక‌ర్స్ కూడా ఇదే ఐడియా ఫాలో అయితే, ఎట్ ఎ టైమ్ మూడు భాష‌ల్లోనూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది దృశ్యం ఫైన‌ల్ పార్ట్. తెలుగులో వెంక‌టేష్ ప్ర‌స్తుతం సైంధ‌వ్ మూవీతో బిజీగా ఉన్నారు. అది పూర్తి కాగానే రానానాయుడు సీక్వెల్ చేస్తారు. అటు మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్‌కి చేతినిండా ప్రాజెక్టులున్నాయి. అజ‌య్ దేవ్‌గ‌న్ కూడా వ‌రుస రిలీజుల‌తో బిజీగా ఉన్నారు. 2024కి అంద‌రూ కాల్షీట్ ఖాళీ చేసుకుని దృశ్యం ప‌నుల వైపు మొగ్గే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.