English | Telugu

గోవా బీచ్ లో దివి అందాల ఆరబోత!

దివి వాద్య.. ఈ పేరు ఇప్పుడు అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ 4 లో ఛాన్స్ కొట్టేసి మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ భామకి మంచి క్రేజ్ ఉంది. అంతే కాకుండా వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉంటుంది. ఈమె ఇండస్ట్రీకి మొదటగా ఒక మోడల్ గా పరిచయం అయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో వెండి తెర పై మెరుపు తీగలా అలా వచ్చి ఇలా వెళ్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. అలా నక్క తోక తొక్కినట్లు వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోయింది.

దివి వాద్య ఇటీవల చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో చేసి మెప్పించింది. ఇంకా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'భోలా శంకర్' మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ సొట్ట బుగ్గల సుందరి. అయితే దివి గతకొంత కాలం నుంచి తన ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫొటోస్ పెడుతూ యూత్ ని ఆకర్షిస్తోంది. అలా తను పోస్ట్ చేసిన ఆ ఫొటోస్ చూసిన కొందరు నెటిజన్లు.. నీ అందంతో చంపేస్తావా ఏంటిని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దివి సమ్మర్ వెకేషన్ అంటూ గోవా బీచ్ లో ప్రత్యక్షమయింది. అక్కడ గోవా బీచ్ లో తన హాట్ ఫోటోస్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ భామ.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లవ్ ఫ్రమ్ గోవా అంటూ ఒక వీడియోని కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా గోవా థింగ్స్ అంటూ తన కాళ్ళని మసాజ్ చేస్తున్నా వ్యక్తిని చూపిస్తూ.. మసాజ్ వీడియోని షేర్ చేసింది దివి. ఇలా తను ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ తో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తుంది.

దివి త్వరలో కవర్ సాంగ్స్, మరికొన్ని వెబ్ సిరీస్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జీ-5లో విడుదలైన 'ఏటీఎమ్' వెబ్ సిరిస్ లో నటించిన దివి.. తన అందాలతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ భామని కొందరు నెటిజన్లు హీరోయిన్ మెటీరియల్ అని అంటున్నారు. మరి ఏ స్టార్ హీరో పక్కనైనా తనకి హీరోయిన్ గా ఛాన్స్ దక్కుతుందో లేదో చూడాలి మరి

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.