English | Telugu

దర్శకుడు బాలచందర్‌ కన్నుమూత

ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. తీవ్ర అస్వస్థతకు గురైన బాలచందర్ గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఐసీయులో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. బాలచందర్ వృద్ధాప్య కారణంగా పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వృద్ధాప్యం, అనారోగ్యానికి తోడు కొద్ది రోజుల క్రితం బాలచందర్ కుమారుడు కైలాసం మరణించారు. అప్పటి నుంచి బాలచందర్ మరింత క్రుంగిపోయారు.

భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయే అదర్భుతమైన సినిమాలను బాలచందర్ రూపొందించారు. తమిళంతోపాటు తెలుగు చిత్రాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి నటుల కెరీర్‌లను తీర్చిదిద్దింది బాలచందరే. సినిమా రంగానికి విశేష సేవలు చేసిన కె.బాలచందర్‌ని పద్మశ్రీ, కలైమామణి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు వరించాయి. బాలచందర్‌ మరణంతో భారతీయ సినిమా రంగంలో ఒక శకం ముగిసింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.