English | Telugu
Prabhas: డైనో’సలార్’ ఇండియాలో ల్యాండ్ అయ్యింది...
Updated : Nov 8, 2023
సెప్టెంబర్ 28న రిలీజ్ అవ్వాల్సిన ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామా సలార్ సినిమా డిసెంబర్ 22కి పోస్ట్ పోన్ అయ్యింది. హోంబలే ఫిల్మ్స్ అండ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ 'సలార్' రిలీజ్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఉన్నాడు సరే పాన్ ఇండియా సినిమా ప్రమోషన్స్ ని షురు చేయాలి అంటే పాన్ ఇండియా హీరో కావాలి కదా. డైనోసర్ ప్రభాస్ ఏమో మోకాలు సర్జరీ కోసం ఫారిన్ వెళ్లాడు, ప్రభాస్ రిటర్న్ రావాలి... ప్రమోషన్స్ చెయ్యాలి, ఆ తర్వాత సినిమా రిలీజ్ కావాలి. ఇవ్వన్నీ అయ్యే పనులు కాదు, సలార్ డిసెంబర్ 22న కూడా రిలీజ్ కాదు అనే కామెంట్స్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ రిలీజ్ డేట్ మారే ప్రసక్తే లేదని చెప్తూనే ఉన్నా కూడా ఎక్కడో చివరి నిమిషంలో సలార్ వాయిదా పడుతుంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తూనే ఉన్నాయి.
ఈ అనుమానాలకి చెక్ పెడుతూ డైనోసర్ ఇండియాలో ల్యాండ్ అయ్యింది. ప్రభాస్ సర్జరీ ముగించుకోని హైదరాబాద్ తిరిగి వచ్చేసాడు. ప్రభాస్ ఎయిర్పోర్ట్ పిక్స్ లీక్ అవ్వడంతో ప్రభాస్ ట్యాగ్ ని, సలార్ ట్యాగ్ ని, సలార్ ఆన్ డిసెంబర్ 22 అనే ట్యాగ్స్ ని ప్రభాస్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో, క్యాప్ పెట్టుకోని ప్రభాస్ ఎప్పటిలాగే సూపర్ కూల్ అండ్ స్టైలిష్ గా ఉన్నాడు. ఇక ఇప్పటి నుంచి సలార్ ప్రమోషన్స్ గ్రాండ్ గా స్టార్ట్ అవ్వనున్నాయి. రాబోయే నెల రోజులు ఆన్ లైన్-ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా సలార్ మేనియా ఉండబోతుంది. టీజర్, 2 సాంగ్స్, ట్రైలర్... సలార్ నుంచి బయటకి వస్తే చాలు ప్రమోషన్స్ పీక్ స్టేజ్ లో ఉంటాయి. ఎండ్ లో ఒక గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా పడితే సలార్ పై హైప్ ఆకాశాన్ని చేరుతుంది. మరి ఇప్పటినుంచి డిసెంబర్ 22 వరకూ ప్రమోషన్స్ రూట్ మ్యాప్ ని సలార్ టీం ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.