English | Telugu

ఐపియల్ లో ధోనీ భార్య సాక్షి రావత్ హల్ చల్

ఐపియల్ లో ధోనీ భార్య సాక్షి రావత్ హల్ చల్ చేసింది. తన భర్త మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సుపర్‍ కింగ్స్ తరపున ఆడుతుంటే ఆ టీమ్ ని చీరప్ చేయటానికి ధోనీ భార్య సాక్షి రావత్ స్టేడియంలో హల్ చల్ సృష్టించింది. తన భర్త టీమ్ లో ఎవరైనా ఫోర్ కొట్టినా చప్పట్లు కొడుతూ, కేకలు వేస్తూ వారిని ఉత్సాహపరుస్తూ నానా గోల చేసింది.

సాక్షి రావత్ ఒక్కటే కాకుండా క్రికెట్ గాడ్ గా పేరొందిన సచిన్ టెండూల్కర్ కూతురు, కొడుకులు, రాయల్ ఛాలెంజర్స్ అధినేత సిద్ధార్థ మాల్యా, అతని గర్ల్ ఫ్రెండ్, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపిక పడుకునే, మహేష్ భూపతి, అతని భార్య లారాదత్తా, ప్రీతి జింతా, షారూఖ్ ఖాన్, శిల్పా శెట్టి, అభిషేక్ బచ్చన్, అమీర్ ఖాన్ ఇలా చాలా మంది సెలబ్రిటీలందరూ కూడా తమకు నచ్చిన టీమ్ లను, వారి మెంబర్లను ప్రోత్సాహపరుస్తూండటం మనం చుస్తూనే ఉన్నాం.

ఆనందోత్సాహాలకు సామాన్యులైనా, సెలబ్రిటీలైనా ఒకటేననీ ఐపియల్ క్రికెట్ మ్యాచ్ లు స్పష్టంగా చెపుతున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.