English | Telugu

జాన్వీ స్థానాన్ని ఆక్ర‌మిస్తున్న సీతారామ‌మ్ హీరోయిన్‌!

శ్రీదేవి త‌న‌య జాన్వీక‌పూర్ న‌టించిన సినిమా బవాల్‌. వ‌రుణ్‌ధావ‌న్‌తో క‌లిసి న‌టించింది. ఈ సినిమా ఏప్రిల్ 7న విడుద‌ల కావాల్సింది. కానీ గ్రాఫిక్స్ తో పాటు, కొన్ని సాంకేతిక కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా విడుద‌ల తేదీ వాయిదాప‌డింది. అందుకే ఈ తేదీని ఆక్ర‌మించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది గుమ్రా టీమ్‌. ఈ సినిమాలో ఆదిత్య‌రాయ్‌క‌పూర్‌తో క‌లిసి న‌టించిన మృణాల్ ఠాకూర్‌. క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కింది గుమ్రా. ఇందులో ఆదిత్య‌రాయ్ క‌పూర్ డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపిస్తారు. ఇందులో మృణాల్ ఠాకూర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు.``ఇంత ఆస‌క్తిక‌ర‌మైన సినిమాలో న‌టించ‌డం చాలా ఆనందంగా ఉంది. డ‌బుల్ రోల్ చేయ‌డ‌మంటే, రెట్టింపు ఆస‌క్తి, రెట్టింపు కృషి ఉండాలి. రెట్టింపు ఆనందం కూడా క‌లుగుతుంది`` అని అన్నారు.

మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ ``క‌థ విన‌గానే న‌చ్చింది. త‌ప్ప‌కుండా ఈ సినిమా చేయాల‌నిపించింది. పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించాల‌న్న‌ది నా చిర‌కాల క‌ల. ఈ సినిమాతో అది నెర‌వేరింది. ఇప్ప‌టిదాకా నేను చేసిన కేర‌క్ట‌ర్ల‌న్నీ ఒక ఎత్తు. ఈ సినిమా మ‌రో ఎత్తు`` అని చెప్పారు మృణాల్‌.అరుణ్ విజ‌య్, విద్య ప్ర‌దీప్ న‌టించిన త‌డ‌మ్ సినిమాకు రీమేక్ గుమ్రా. టీసీరీస్ భూష‌ణ్ కుమార్, ముర‌ద్ ఖేతాని క‌లిసి నిర్మించారు. ఏప్రిల్ 7న ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.జాన్వీ రాక‌పోయినా, ఆ స్థానాన్ని సీతారామ‌మ్ న‌టి మృణాల్ భ‌ర్తీ చేస్తున్నందుకు ఆనందంగా ఉంద‌ని అంటున్నారు నెటిజ‌న్లు.గ‌తేడాది సీతారామ‌మ్ త‌న‌కు ఎంత గొప్ప పేరు తెచ్చిపెట్టిందో, గుమ్రా కూడా అంతే క్రెడిట్ తెచ్చిపెడుతుంద‌ని అన్నారు మృణాల్‌.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.