English | Telugu
అల్లుడితో ఆడిపాడిన లేడీతో రజనీ జోడీ!
Updated : Aug 26, 2023
తన మాజీ అల్లుడు ధనుష్‌తో ఆడిపాడిన లేడీతో రజనీకాంత్ త్వరలోనే జోడీ కట్టబోతున్నారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించడానికి మలయాళ నటి మంజు వారియర్ ఆల్రెడీ ఓకే చెప్పేశారు. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం ఈ కాంబినేషన్ కుదిరింది. తలైవర్ 170 అని టెంటేటివ్‌గా పిలుస్తున్నారు. ఈ సినిమాలోనే అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్ కీ రోల్స్ చేస్తున్నారు. తమిళంలో ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తున్నారు మంజు వారియర్. అజిత్ కుమార్‌తో తునివు చేశారు. ధనుష్ తో అసురన్ చేశారు. త్వరలోనే ఆర్య, గౌతమ్ కార్తిక్ కాంబినేషన్‌లో సినిమా మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాకు మిస్టర్ ఎక్స్ అనే పేరు ఖరారైంది. మను ఆనంద్ దర్శకత్వం వహిస్తారు. మంజు వారియర్ తన ఫేవరేట్ ఆర్టిస్ట్ విజయ్ సేతుపతితో విడుదలై 2లో నటిస్తున్నట్టు టాక్. సూరి, విజయ్ సేతుపతి నటించిన విడుదలై సినిమా ఫస్ట్ పార్ట్ చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా సీక్వెల్‌లోనే విజయ్ సేతుపతికి భార్యగా కనిపించనున్నారు మంజు వారియర్. రజనీకాంత తో ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం థ్రిల్లింగ్‌గా ఉందని చెప్పారట మంజువారియర్.
జై భీమ్ సినిమాకు దర్శకత్వం వహించిన టి.జె.జ్ఞానవేల్ తలైవర్ 170 సినిమాలో మంజు వారియర్‌కి కూడా చాలా మంచి రోల్ రాశారట. వినగానే ఓకే చెప్పారట మంజు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. సెప్టెంబర్ మూడో వారం నుంచి షూటింగ్ మొదలవుతుందని టాక్. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తారు. ఈ సినిమాలో రజనీకాంత్ పేరు వేట్టయన్ అని ప్రచారమవుతోంది. నెగటివ్ షేడ్స్ ఉంటాయని కూడా అంటున్నారు. రజనీకాంత్‌ని ఢీకొట్టే వ్యక్తిగా ఫాహద్, రజనీకి ఫ్రెండ్‌గా అమితాబ్ బచ్చన్ నటిస్తారట. మామన్నన్‌లో నటించిన రత్నవేలు కేరక్టర్ ఫాహద్‌కి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది.