English | Telugu

జగపతిబాబుపై దాడి చేసిన డెవిల్‌, యానిమల్‌.. తర్వాత ఏం జరిగి ఉంటుంది?

సినిమా ఇండస్ట్రీలో ఎవరి కెరీర్‌ ఎలా టర్న్‌ తీసుకుంటుందనే విషయం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే విలన్‌గా ఎంట్రీ ఇచ్చినవారు ఆ తర్వాత స్టార్‌ హీరో అయిపోతారు. కొందరు విలన్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసి ఆ తర్వాత విలన్‌గా మారిపోతారు. ఇక నటులు డైరెక్టర్‌ అయిపోవడం, మ్యూజిక్‌ డైరెక్టర్లు హీరోలుగా మారడం మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా బుద్ధిమంతుడు క్యారెక్టర్స్‌ చేస్తూ వచ్చిన జగపతిబాబు.. సడన్‌గా యాక్షన్‌ సినిమాల వైపు టర్న్‌ తీసుకొని గాయం, అంత:పురం వంటి సినిమాల్లో తనలోని అదర్‌ యాంగిల్‌ కూడా చూపించారు. ఆ తర్వాత కూడా హీరోగానే కొనసాగిన జగ్గుభాయ్‌... లెజెండ్‌ సినిమాతో పవర్‌ఫుల్‌ విలన్‌గా అవతరించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు.

ఇప్పుడు బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చి ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అంటూ సెలబ్రిటీలతో కలిసి సందడి చేస్తున్నారు జగపతిబాబు. ఈ టాక్‌ షోను అక్కినేని నాగార్జునతో స్టార్ట్‌ చేశారు. ఈ షోలో ఇద్దరూ ఎన్నో విషయాలు చర్చించుకున్నారు. అలాగే హీరోయిన్‌ శ్రీలీల, నాని కూడా ఈ షోలో పాల్గొన్నారు. సరదాగా నడిచే ఈ షోలో ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించే ఎన్నో విషయాలను సెలబ్రిటీల నుంచి రాబడుతున్నారు జగపతిబాబు. తాజాగా ఈ షోకు ఒక డెవిల్‌, ఒక యానిమల్‌ వచ్చి అనేక విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది జీ తెలుగు.

ప్రేక్షకులను భయపెట్టడమే తన లక్ష్యం అని తొలి సినిమా నుంచే చెప్తూ వస్తున్న రామ్‌గోపాల్‌వర్మ.. డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేసి టాప్‌ డైరెక్టర్‌గా ఎదిగారు. మధ్య మధ్య దెయ్యాలకు సంబంధించిన సినిమాలు చేసినా అతను అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల్ని భయపెట్టలేకపోయారు. అయినా ఎప్పటికైనా డెవిల్‌ సినిమాలతో ప్రేక్షకుల్ని భయపెడతానని కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు వర్మ. ఇక అర్జున్‌రెడ్డి వంటి వయొలెంట్‌ లవ్‌స్టోరీని తెరకెక్కించి తొలి సినిమాతోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న సందీప్‌రెడ్డి వంగా.. యానిమల్‌ చిత్రంతో ఎక్స్‌ట్రీమ్‌ లెవల్‌కి వెళ్లిపోయాడు. ఇప్పుడు ప్రభాస్‌తో స్పిరిట్‌ చిత్రాన్ని చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది.

ఇదిలా ఉంటే.. విభిన్నమైన ఐడియాలజీ ఉన్న ఇద్దరు దర్శకులు ఒకేచోట కలిస్తే ఎలా ఉంటుంది అనే ఆసక్తికరమైన విషయం ఈ ఆదివారం జీ తెలుగులో ప్రసారమయ్యే జయమ్ము నిశ్చయమ్మురా టాక్‌ షోలో తెలుస్తుంది. రిలీజ్‌ అయిన ప్రోమోలోని విజువల్స్‌ చూస్తే.. షో ఎంతో ఆసక్తికరంగా ఉంటుందనిపించింది. సెప్టెంబర్‌ 7 రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ఈ టాక్‌ షో ప్రసారం కానుంది. ‘లెజెండ్‌’ చిత్రంలో హీరోగా నటించిన నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌’ షోతో ఆకట్టుకుంటూ ఉంటే.. అందులో విలన్‌గా నటించిన జగపతిబాబు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.