English | Telugu

లింగ సమానత్వ రాయబారిగా కృతి సనన్.. హీరోని ఆ మాట అడిగే దైర్యం ఉందా!

సూపర్ స్టార్ 'మహేష్ బాబు'(Mahesh Babu),సుకుమార్(Sukumar)కాంబినేషన్ లో తెరకెక్కిన '1 నేనొక్కడినే' చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన నటి 'కృతి సనన్'. ఆ తర్వాత 'హీరోపంత్' అనే మూవీతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ హిట్ మూవీస్ లో ఒకటైన 'పరుగు' కి రీమేక్ గా ఆ చిత్రం తెరకెక్కింది. ఆ తర్వాత వరుసగా పలు విభిన్న చిత్రాల్లో చేస్తు, తన అద్భుతమైన నటనతో అభిమానులని, ప్రేక్షకులని అలరిస్తు వస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ 'ఆదిపురుష్' లో 'సీతమ్మ తల్లి' గా చేసి భారతీయ ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యింది. నిర్మాతగాను సత్తా చాటుతున్న కృతి సనన్ రీసెంట్ గా 'ఇక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ ఇండియా'(Unfpa)కి లింగ సమానత్వ గౌరవ రాయబారిగా ఎంపిక అయ్యింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు ఇండస్ట్రీలో హీరోకి లభించే సౌకర్యాలు హీరోయిన్ కి లభించవు. సౌకర్యాల్లోనే కాదు గౌరవించడంలోను తేడా ఉంది. హీరోలకి పెద్ద పెద్ద కార్లు, రూమ్స్ కేటాయిస్తారు. మాకు మాత్రం అలా ఉండవు. ఇలా ఎందుకు చేస్తారని చాలా సార్లు బాధపడ్డాను. షూటింగ్ టైంలో హీరో కంటే ముందే సెట్ కి వచ్చి వెయిట్ చేస్తుండాలి. ఒక వేళ మేము సెట్ కి లేట్ గా వస్తే ఒప్పుకోరు .హీరోలు లేట్ గా వచ్చినా వాళ్ళని అడిగే దైర్యం చెయ్యరు. మా అమ్మ 'లింగ వివక్ష'ని దాటుకొని నాకు నా సోదరికి పూర్తి స్వేచ్ఛని ఇచ్చి పెంచింది. మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలని కృతి సనన్ చెప్పుకొచ్చింది.

ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ ఇండియా ప్రధాన కార్యాలయం 'న్యూయార్క్'(New York)లో ఉంది. ప్రధానంగా లింగ సమానవత్వాన్ని పెంపొందించడమే ఆ సంస్థ ప్రధాన లక్ష్యం. దాంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పునరుత్పత్తి, తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, బాల్య వివాహం , లింగ ఆధారిత హింస, ప్రసూతితో పాటు, స్త్రీ కి సంబందించిన అనేక సమస్యలపై ఎవెర్ నెస్ తీసుకురానుంది. సినిమాల పరంగా చూసుకుంటే కృతి సనన్ గత ఏడాది 'దోపత్తి' అనే వెబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రస్తుతం 'తేరే ఇష్క్ మెయిన్' తో పాటు 'కాక్ టైల్ పార్ట్ 2 ' చిత్రాల్లో చేస్తుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.