English | Telugu
అప్పుడు చాలా ఏడ్చాను: దీపిక
Updated : Mar 11, 2014
బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకునే ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. గతంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో ప్రేమాయణం సాగించి, తర్వాత ఇద్దరు విడిపోయారు. అయితే ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న దీపికను రణబీర్ తో మళ్ళీ కలిసే అవకాశం ఉందా అని అడిగితే... "ఆ విషయం గురించి నేను ఇప్పటి వరకు ఆలోచించలేదు. ప్రస్తుతం ఎవరి దారిలో వారు ఉన్నాము. బ్రేకప్ అయినప్పుడు చాలా ఏడ్చాను. ఆ తర్వాత అర్థం చేసుకొని రియలైజ్ అయ్యాను" అని తన మనసులోని బాధను పంచుకుంది.
ఇదిలా ఉంటే దీపిక ప్రస్తుతం రణవీర్ సింగ్ తో ప్రేమాయణం సాగిస్తుందని వార్తలు వస్తున్నాయి. రణబీర్ తో బ్రేకప్ అయ్యాక రణవీర్ తో ప్రేమాయణం సాగిస్తుంది. అటు రణబీర్ కూడా కత్రినాతో కలిసి రొమాన్స్ పనుల్లో బిజీ అయిపోయాడు. మరి ఇందులో ఎవరు ఎవరికీ జోడి అవుతారో త్వరలోనే తెలియనుంది.