English | Telugu
ఆమెను చూసి అసూయ పడిన దీపిక
Updated : Mar 11, 2014
హిందీలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన "క్వీన్" సినిమా ఇటీవలే విడుదలైంది. బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. హిందీలో విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లతో, సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాను ఇటీవలే బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకునే చూసిందట. ఈ సినిమా చూసిన తర్వాత అందులో నటించిన కంగనాని చూస్తే దీపికాకి అసూయగా ఉందని తెలిపింది. ఎందుకంటే ఈ సినిమాలో కంగనా అధ్బుతంగా నటించింది. ఆమె నటన చూసి నాకు చాలా అసూయ కలిగింది. చిత్ర దర్శకుడు వికాస్ మహిళల భావోద్వేగాలను చాలా చక్కగా తెరక్కించాడు" అంటూ ప్రశంసల వర్షం కురిపించింది. మరి ఏదేమైనా బాలీవుడ్ లో ప్రస్తుతం టాప్1 హీరోయిన్ గా ఉన్న దీపిక ఇలా మరో సినిమా గురించి గొప్పగా చెప్పడం తన సంస్కారానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.