English | Telugu

'దిక్కులు చూడ‌కు రామ‌య్యా' రెడీ అయ్యాడు

నాగ శౌర్య, సనా జంటగా నటించిన చిత్రం 'దిక్కులు చూడ‌కు రామ‌య్యా'. సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమా ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇదో ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్ టైనర్. త్రికోఠి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ చిత్ర౦లో అజయ్, ఇంద్రజ కీలక పాత్రలో నటించారు.సాయి కొర్రపాటి నిర్మాత.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.